SSMB28 | మారుతి ఫార్ములాను ఫాలో అవుతున్న త్రివిక్రమ్.. మహేష్ సినిమాలో అదే హైలేట్ అవ్వబోతుందా?
SSMB28 Movie | మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ SSMB28. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్స్ తర్వాత వీళ్ల కాంబోలో తెరకెక్కుతున్న హాట్రిక్ సినిమా కావడంతో అందిరిలోనూ ఎక్కడలేని ఆసక్తి నెలకొంది.
SSMB28 Movie | మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ SSMB28. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్స్ తర్వాత వీళ్ల కాంబోలో తెరకెక్కుతున్న హాట్రిక్ సినిమా కావడంతో అందిరిలోనూ ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. కాగా ఇటీవలే రిలీజైన ఫస్ట్‌లుక్ అభిమానులను కాస్త నిరాశపరిచింది. ఇప్పటికే అలాంటి స్టిల్స్‌లో బాబును ఎన్నో సార్లు చూశామని పెదవి విరిచారు. అయితే మరికొంత మంది మాత్రం బాబు సిగరెట్ తాగుతూ వస్తుంటే వేరే లెవల్లో ఉందని కామెంట్స్ చేశారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి దింపబోతున్నట్లు ఇటీవలే చిత్రబృందం ప్రకటించింది.
ఈ క్రమంలో షూటింగ్‌ను కూడా పక్కాగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మహేష్‌కు ఒక చిన్న డిసీజ్‌ను త్రివిక్రమ్ పెట్టాడట. అదే ఇంటర్వెల్‌కు హైలెట్ అవుతుందని టాక్. అంతేకాకుండా సెకండ్ ఆఫ్ మొత్తం ఆ డిసీజ్ చుట్టే తిరుగుందట. దానికి తగ్గట్లే కావలిసినన్ని కామెడీ సీన్ల్, ఈలలు వేయించే యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశాడట. కాగా ఇన్నాళ్లు మారుతి తన సినిమాల్లో ఏదో ఒక డిసీజ్‌ను పెట్టి హిట్లు కొట్టాడు. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా ఇలాంటి ఫార్ములాతో వచ్చి బ్లాక్‌బస్టర్ కొట్టే ఆలోచనలో ఉన్నాడట.
ఇందులో నిజమెంతుందో తెలియాలంటే సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా పూజాహెగ్డే, శ్రీలీలలు నటిస్తున్నారు. థమన్ స్వరాలందిస్తున్నాడు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధా కృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

