Ramayana | ‘రామాయణ’ అద్భుతంగా ఉంది.. ఎస్.ఎస్.రాజమౌళి ప్రశంసల వర్షం!
SS Rajamouli | భారతీయ సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ‘రామాయణ: పార్ట్ 1’ (Ramayana: Part 1) చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనం సృష్టిస్తోంది.
భారతీయ సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ‘రామాయణ: పార్ట్ 1’ (Ramayana: Part 1) చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనం సృష్టిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, కన్నడ సూపర్‌స్టార్ యశ్ రావణాసురుడిగా, టాలీవుడ్ నటి సాయిపల్లవి సీతాదేవిగా నటించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ సినిమాను తాజాగా వీక్షించిన ప్రముఖ టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli) సోషల్ మీడియా వేదికగా సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు.
ఈ చిత్రం గురించి రాజమౌళి ప్రత్యేకంగా స్పందిస్తూ.. “రామాయణ సినిమా రూపకల్పన, పెద్ద తెరపై కనిపించే విజువల్స్ అద్భుతంగా, కంటికింపుగా ఉన్నాయి. ముఖ్యంగా వనవాసం ఘట్టం నుంచి రాముడిగా రణ్‌బీర్ కపూర్ ప్రశాంతమైన లుక్‌తో పాటు ఎంతో గంభీరంగా కనిపించారు. ఇక రావణాసురుడి పాత్రలో యశ్ నటన ఎంతో భయానకంగా, పవర్‌ఫుల్‌గా ఉంది. సీతాదేవిగా సాయిపల్లవి తనదైన అభినయంతో చాలా హుందాగా నటించారు. సినిమాలోని ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు అయితే నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఆ ప్రతి క్షణాన్ని నేను పూర్తిగా ఆస్వాదించాను” అని ఆయన కొనియాడారు ఇంతటి గొప్ప విజన్‌తో తెరకెక్కించిన నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీష్ తివారీతో పాటు చిత్ర బృందం మొత్తానికి జక్కన్న రాజమౌళి తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం రాజమౌళి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ అద్భుతంగా ఉంది.. ఎస్.ఎస్.రాజమౌళి ప్రశంసల వర్షం!
Y.S. Jagan | చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికల్లో లబ్ధి : వైఎస్ జగన్
ఎమ్మెల్యే వేముల వీరేశంకు తప్పిన ప్రమాదం
Kedarnath Dham Yatra | ముగింపు దశలోనూ కేదార్ నాథ్ ధామ్‌కు తగ్గని యాత్రికులు
తిమ్మాపురంలో భూముల రీ సర్వే పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

