స్టార్స్, ఇమేజ్‌ల కంటే మంచి కథలకే ప్రాధాన్యతనిస్తూ సినిమాలు చేస్తానని అన్నారు సృజన్ ఎరబోలు. నిర్మాతగా, పంపిణీదారుడిగా ప్రతిభను చాటుకుంటున్నారాయన. శనివారం హైదరాబాద్‌లో సృజన్ ఎరబోలు ముచ్చటిస్తూ ‘ఓవర్సీస్లో పంపిణీదారుడిగా ‘కంచె’తో నా సినీ ప్రయాణం ప్రారంభమైంది. అర్జున్‌రెడ్డి, మహానటితో పాటు 30 సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించా. మను, సూర్యకాంతం సినిమాల్ని భాగస్వాములతో కలిసి నిర్మించా. కథల ఎంపికలో తప్పులు జరగడంతో ఆ సినిమాలు సరిగా ఆడలేదు. నా అభిరుచులకు అనుగుణంగా సినిమాలు చేయాలని సొంతంగా ఎస్ ఒరిజినల్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించా. అద్భుతం, గతం, తిమ్మరుసు సినిమాల్ని చేశా. ప్రస్తుతం నేను నిర్మిస్తున్న ఎనిమిది సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. రొటీన్‌కు భిన్నమైన సినిమాలు చేస్తాననే పేరుతెచ్చుకోవాలని ఉంది . అగ్రహీరోతో చేయబోతున్న ఓ సినిమాను జనవరిలో ప్రారంభిస్తాం’ అన్నారు.