Shah Rukh Khan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మళ్ళీ కలిసి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. వీరిద్దరూ జంటగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న హై-ఓల్టేజ్ యాక్షన్ డ్రామా ‘కింగ్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా కేప్ టౌన్ వీధుల్లో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో షారుఖ్ ఖాన్ ‘సాల్ట్ అండ్ పెప్పర్’ లుక్లో ఎంతో స్టైలిష్గా కనిపిస్తుండగా, గర్భవతి అయిన దీపికా పదుకొణె తన ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతూ షూటింగ్లో పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంటోంది. వీరిద్దరి మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ లేదా సినిమాకు అత్యంత కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం.
దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్తో రాబోతున్న ఈ సినిమా ద్వారా షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ వెండితెరకు పరిచయం కాబోతుండటం విశేషం. ఇక పవర్ఫుల్ విలన్ పాత్రలో అభిషేక్ బచ్చన్ కనిపిస్తుండగా, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. షారుఖ్ మరియు దీపికా కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట మొదలవుతుందని అభిమానులు ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
#ShahRukhKhan and #DeepikaPadukone bringing the heat to the streets of Cape Town as they shoot for #King. 🔥
Picture Credit: Shadab Ahmed #Celebs pic.twitter.com/d3lt5CohYh
— Filmfare (@filmfare) May 1, 2026