టాప్ 5 కంటెస్టెంట్స్ ఎమోషనల్ జర్నీ వీడియోలు ప్లే చేయడం పూర్తైన తర్వాత బిగ్ బాస్.. టాప్ 5లో నిలిచిన కంటెస్టెంట్లను వారి మరపురాని క్షణాలను పంచుకోవాలని సూచిస్తూనే అక్కడున్న కొన్ని ఫొటోలను బిగ్‌బాస్‌కు ఇవ్వాలని చెప్పాడు. ముందుగా మానస్ మాట్లాడుతూ.. టెడ్డీబేర్ టాస్కులో గెలిచినప్పుడు నేను, సన్నీ, అనీ మాస్టర్‌ను సంతోషంతో ఎత్తుకున్నాం.. అంటూ ఆ ఫొటోను బిగ్‌బాస్‌కి ఇచ్చాడు.
షణ్ముఖ్ మాట్లాడుతూ.. మా అమ్మ లెటర్ ముక్కల కావడం జర్నీలో బాధాకరమైన విషయం అంటూ అందుకు సంబంధించిన ఫొటోని బోర్డ్‌పై పెట్టాడు. ఇక సిరి .. ‘బ్రిక్స్ ఛాలెంజ్ కంటే ముందు షణ్నుకు, నాకు గొడవ అయింది. ఫేక్ ఫ్రెండ్ అని తిట్టాను కానీ అది తప్పని ఈ టాస్క్‌తో రుజువైంది. ఈ జర్నీ మొత్తంలో నాకు అండగా నిలిచింది షణ్ను ఒక్కడే’ అని చెప్పుకొచ్చింది.
ఇక శ్రీరామ్ మాట్లాడుతూ.. ఈ ఇంట్లో నాకు మంచి బాండ్ కుదురిన ఫస్ట్ పర్సన్ హమీదా. ఆమె వెళ్లిపోయాక చాలా బాధేసింది. చాలా మిస్ అవుతున్నాను, ఈ విషయాన్ని ఎప్పుడూ బయటకు చెప్పలేదు. ఈమె ఉండుంటే లోన్ రేంజర్ అన్న ట్యాగ్ వచ్చేది కాదని ఫీలయ్యాడు. బేటన్ టాస్కులో నా టీమ్ వాళ్లే నన్ను వరస్ట్ పర్ఫామర్ అన్నారు. అప్పుడు జైల్లో పడి బాధపడితే మానస్ కూడా ఏడ్చాడు అని చెప్పుకొచ్చాడు. అందరినీ నవ్వించడమే తన నినాదంగా పేర్కొన్నాడు సన్నీ.