Sriram Chandra: శ్రీరామ్ చంద్రకు పెరుగుతున్న మద్దతు.. రంగంలోకి ప్రభాస్ పెద్దమ్మ

బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం విజేత ఎవరన్నది మరో మూడు రోజులలో తేలనుంది. ప్రస్తుతం హౌజ్‌లో సన్నీ, శ్రీరామ్ చంద్ర, మానస్, సిరి,షణ్ముక్ ఉండగా వీరిలో విన్నర్ అవుతారు అని అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. మరోవైపు వారిని గెలిపించేందుకు సెలబ్రిటీలు సోషల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. అయితే ఇండియన్ ఐడల్ విన్నర్‌గా నిలిచి తెలుగోడి సత్తా చాటిన శ్రీరామ్ ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ కూడా కావాలని చాలా మంది కోరుకుంటున్నారు.
సోనూసూద్, శంకర్ మహదేవన్,ఎండీ సజ్జనార్, పాయల్ రాజ్‌పుత్ సహా పలువురు సెలబ్రిటీలు శ్రీరామ్‌కు మద్దతుగా నిలిచారు. తాజాగా కృష్ణంరాజు భార్య, ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి వీడియో సందేశం ద్వారా శ్రీరామ్‌కు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. హాయ్ శ్రీరామ్. బిగ్‌బాస్ షో చూస్తున్నాం. నాకు, కృష్ణంరాజు గారికి నీ పాటలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా భక్తి పాటలు చాలా ఇష్టం. అప్పుడు ఇండియన్ ఐడెల్‌లో గెలిచి తెలుగువారందరకీ ఎంతో గర్వకారణం అయ్యావ్.
ఇప్పుడు బిగ్‌బాస్‌లో కూడా గెలవాలని మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ తరపు నుంచి కోరుకుంటున్నాను. నువ్వు తప్పకుండా గెలుస్తావ్. ఆల్ ది బెస్ట్’ అంటూ చెప్పుకొచ్చారు. శ్రీరామ్ చంద్ర సోషల్ మీడియా పేజ్‌లో వీడియో పోస్ట్ చేయగా, ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.ప్రభాస్ ఫ్యామిలీ నుండి సపోర్ట్ వచ్చిందంటే శ్రీరామ్‌కి మరిన్ని ఓట్లు పడడం ఖాయం అంటూ జోస్యాలు చెబుతున్నారు.
https://www.instagram.com/p/CXiBFTrNja9/?utm_source=ig_web_copy_link
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

