‘ఎన్నారైలు అంటే ఏదో ఒక సినిమా తీసి వెళ్లిపోతారనే అభిప్రాయం ఉంది. కానీ నేను ప్రతీ ప్రాజెక్ట్‌ను ఛాలెంజ్‌గా తీసుకుంటాను. సినిమా మీద పాషన్ ఉంది కాబట్టి రెగ్యులర్‌గా ప్రొడక్షన్లో ఉంటాం’ అన్నారు శ్రీనివాసరావు చింతలపూడి. ఆయన నిర్మాతగా తెరకెక్కించిన తాజా చిత్రం ‘బ్యాడ్‌బాయ్ కార్తీక్’ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమాకు రామ్ దేశినా (రమేష్) దర్శకుడు. ఈ సందర్భంగా బుధవారం నిర్మాత శ్రీనివాస రావు చింతలపూడి విలేకరులతో మాట్లాడారు. కదిరి నరసింహస్వామి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ నడుస్తుందని, యాక్షన్ ఘట్టాలు రోమాంచితంగా ఉంటాయని చెప్పారు. ‘ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ.
హరీశ్ జయరాజ్ అద్భుతమైన పాటలిచ్చారు. ఈ సినిమాలో శ్రీదేవి పాత్ర చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక నాగశౌర్య పాత్ర డబుల్ సర్ప్రైజ్నిస్తుంది. ఆయన కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో తీసిన సినిమా ఇది. దాదాపు 400 స్క్రీన్లలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’ అని ఆయన అన్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ మరోస్థాయిలో ఉంటుందని, ఐదు యాక్షన్ ఘట్టాలు హైలైట్‌గా నిలుస్తాయని, విజువల్స్ కూడా అబ్బురపరుస్తాయని తెలిపారు. తమ సంస్థ జూన్‌లో మరో సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నదని, మరికొన్ని ప్రాజెక్ట్‌లు కూడా చర్చల దశలో ఉన్నాయని నిర్మాత శ్రీనివాస రావు చింతలపూడి పేర్కొన్నారు.