Srinivasa Mangapuram Teaser | సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఘట్టమనేని కుటుంబం నుంచి మరో మూడో తరం కథానాయకుడు వెండితెరకు పరిచయమవుతున్నారు. కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. బుధవారం సాయంత్రం ఈ చిత్ర టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్ చూస్తుంటే ఇది తిరుపతి నేపథ్యంలో సాగే ఒక ప్యూర్ అండ్ ఇంటెన్స్ లవ్ స్టోరీగా అనిపిస్తోంది. ‘మంగ నీది కాదు వాసు బాబు’ అనే డైలాగ్‌తో మొదలై, ‘మంగ లేకుండా ఈ శ్రీను గాడు తిరుపతి వదిలి వెళ్లే ప్రసక్తే లేదు’ అని హీరో చెప్పే డైలాగ్ వరకు టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
మొదటి సినిమాతోనే జయకృష్ణ మాస్ అండ్ రస్టిక్ లుక్‌లో ఆకట్టుకున్నారు. తన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు డైలాగ్ డెలివరీలో తాత, బాబాయ్‌ల ఛాయలు కనిపిస్తున్నాయని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. టీజర్లో ఆమె గ్లామర్ మరియు హీరోతో కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచాయి. ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. టీజర్ చివరలో ఆయన ఇచ్చిన ఎంట్రీ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు ప్రాణం పోసింది. అశ్విని దత్ సమర్పణలో, పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.