సుధీర్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘హంట్’. సీనియర్ హీరో శ్రీకాంత్, ప్రేమిస్తే ఫేమ్ భరత్ నివాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. మహేష్ దర్శకుడు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవల ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘సినిమాకు అన్ని వర్గాల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
మొదట్లో సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయపడ్డాం. కాని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. డిఫరెంట్ చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ చిత్రం మరోసారి ఫ్రూవ్ చేసింది’ అన్నారు. ఈ సమావేశంలో భరత్, శ్రీకాంత్, సినిమాటోగ్రాఫర్ అరుల్ విన్సెంట్ పాల్గొన్నారు.