‘ఖుషి’ టికెట్స్ దొరికాయా?
శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు జంటగా నటిస్తున్న సినిమా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. ఈ చిత్రాన్ని మిత్రవిందా మూవీస్, శ్రీజ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై శ్రీజ నిర్మిస్తున్నారు. కథ స్క్రీన్ప్లే మాటలు ‘జాతిరత్నాలు’ దర్శకుడు కేవీ ఆనంద్ అందిస్తున్నారు. వంశీధర గౌడ్, పి.లక్ష్మీనారాయణ దర్శకులు.
చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 2న విడుదలకానున్నది. బుధవారం జరిపిన పాత్రికేయ సమావేశంలో దర్శకులు వంశీధర గౌడ్, పి.లక్ష్మీనారాయణ చిత్ర విశేషాలు తెలిపారు. వారు మాట్లాడుతూ…‘తెలుగు సినీ పరిశ్రమలో ఆణిముత్యాల్లాంటి చిత్రాలను నిర్మించిన పూర్ణోదయ అనుబంధ సంస్థలో దర్శకులుగా పరిచయం అవడం అదృష్టంగా భావిస్తున్నాం. ఓ మంచి కథను తెరకెక్కించాలనే ఆలోచనే మమ్మల్ని ముందుకు నడిపించింది.
ఇద్దరం దర్శకులమైనా సమన్వయంతో పనిచేశాం. సన్నివేశాల చిత్రీకరణ, కథలోని భావోద్వేగాలను ఎలా చూపించాలని కలిసే ఆలోచించాం. 2000 సంవత్సర నేపథ్యంతో ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రంలో హీరో పేరు శ్రీను. అతను పవన్ కళ్యాణ్ అభిమాని. కాలేజీలో ఒక అమ్మాయిని ఇష్టపడతాడు.
ఆ అమ్మాయి ‘ఖుషి’ సినిమా తొలి రోజు తొలి ఆట టికెట్స్ కావాలని శ్రీనును అడుగుతుంది. ఆ టికెట్స్ సంపాదించేందుకు అతను ఎలాంటి ప్రయత్నాలు, సాహసాలు చేశాడు అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించాం. కథలో ఆశ్చర్యపరిచే అంశాలుంటాయి. 20 ఏళ్ల కిందటి వాతావరణాన్ని సినిమాలో అందంగా రీ క్రియేట్ చేశాం.’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

