తొలిఆట తేదీ ఖరారు
శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. ఈ చిత్రాన్ని మిత్రవిందా మూవీస్, శ్రీజ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై శ్రీజ నిర్మిస్తున్నారు. కథ స్క్రీన్‌ప్లే మాటలు ‘జాతిరత్నాలు’ దర్శకుడు కేవీ ఆనంద్ అందిస్తున్నారు. వంశీధర గౌడ్, పి.లక్ష్మీనారాయణ దర్శకులు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ఖరారు చేశారు.
సెప్టెంబర్ 2న సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ…‘కామెడీ ఎంటర్టైనర్గా మా చిత్రాన్ని రూపొందించాం. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, రెండు లిరికల్ పాటలకు మంచి స్పందన వస్తున్నది.
అనుదీప్ కేవీ రచన ఆకట్టుకుంటుంది. ఒక కొత్త తరహా సినిమాను చూడబోతున్నారు’ అని చెప్పారు. తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి, మహేష్ ఆచంట తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ప్రశాంత్ అంకిరెడ్డి, ఎడిటర్ : మాధవ్, సంగీతం : రాధన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

