Srikanth Addala | మహేష్ ఫ్యాన్స్‌ను కలలో కూడా భయపడేలా చేసిన సినిమా బ్రహ్మోత్సవం. అప్పట్లో ఈ సినిమా బెనిఫిట్ షోలు చూసిన ఫ్యాన్స్ బాధ అంతా ఇంతా కాదు. థియేటర్లలో రచ్చ చేద్దామని వెళ్లి.. సినిమా మధ్యలోనే వచ్చిన అభిమానులెందరో. అంతటి ఘోర పరాజయం సాధించింది బ్రహ్మోత్సవం. సీతమ్మ వాకిట్లో వంటి క్లాస్ సినిమా తర్వాత పిలిచి మరీ అవకాశమిచ్చిన మహేష్‌కు.. జీవితంలో మర్చిపోలేని సినిమా ఇచ్చాడు అడ్డాల. ఈ సినిమా ఇచ్చిన షాక్‌కు అడ్డాల దాదాపు నాలుగేళ్ల వరకు మెగా ఫోన్ పట్టలేదు. ఆ తర్వాత నారప్పను చేయమని సురేష్ బాబే అవకాశం ఇచ్చాడు.
ఇక బ్రహ్మోత్సవం సినిమా గురించి శ్రీకాంత్ అడ్డాల ఇప్పటివరకు ప్రస్తావించిన దాఖలాలు ఎక్కడ లేవు. కాగా తాజాగా పెదకాపు సినిమా ట్రైలర్ లాంచ్‌లో ఈ సినిమా గురించి మాట్లాడాడు. పీహెచ్డీ చేస్తున్న టైమ్‌లో మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పాడు. నటుడు సునీల్ ఓ సారి కలిసినప్పుడు చిరాకేసి బ్రహ్మోత్సవం తీశావ అని అడిగాడని, దానికి చాలా నవ్వుకున్నానని చెప్పాడు. కానీ హిట్టు ఫ్లాపు మన చేతుల్లో ఉండవనే వాస్తవాన్ని తానెప్పుడూ మర్చిపోనని చెప్పాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు నారప్పతో యాక్షన్ రూటుకు వచ్చేశాడు.
ప్రస్తుతం ఆయన పెదకాపు అనే కుల రాజకీయలపై సినిమా చేస్తున్నాడు. ఇంత సెన్సిబుల్ సబ్జెక్ట్‌ను ఎలా హ్యండిల్ చేశాడా అని అందిరిలోనూ అమితాసక్తి నెలకొంది. దానికి తగ్గట్లే టీజర్, ట్రైలర్లు జనాల్లో తిరుగులేని అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది.