Cinema News | రాజీవ్‌గాంధీ హత్య జరిగిన రోజు విశాఖలో ఏం జరిగిందంటే..
వెన్నెల కిశోర్ టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'. అనన్య నాగళ్ల, సియా గౌతమ్ కీలక పాత్రధారులు. రైటర్ మోహన్ దర్శకుడు.
- చంటబ్బాయి తాలూకా..
Cinema News | వెన్నెల కిశోర్ టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. అనన్య నాగళ్ల, సియా గౌతమ్ కీలక పాత్రధారులు. రైటర్ మోహన్ దర్శకుడు. వెన్నపూస రమణారెడ్డి నిర్మాత. వంశీ నందిపాటి చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. గురువారం హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ సక్సెస్ మీట్‌ని నిర్వహించారు.
ట్రైలర్ మూడు మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేయడం బిగ్ ఎచీవ్మెంట్ అని, కథను నమ్మి చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇదని, కథనం అద్భుతంగా ఉంటుందని, సినిమా పూర్తవ్వగానే పార్ట్ 2 ఎప్పుడని అడుగుతారని వంశీ నందిపాటి చెప్పారు. ‘ఉత్తరాంధ్ర నేపథ్యంతో కూడిన కథ కావడంతో వెన్నెల కిశోర్‌తోపాటు ఆర్టిస్టులంతా ఆ యాసను ప్రాక్టీస్ చేసి నటించారు. రాజీవ్‌గాంధీ హత్య జరిగిన రోజు జరిగే కథ ఇది.
ఆయన విశాఖ పర్యటన ముగించుకుని శ్రీపెరంబదూర్ వెళ్లారు. అక్కడ హత్యకు గురయ్యారు. అలాంటి పెద్ద సంఘటన జరిగినప్పుడు చిన్న సంఘటనల్ని ఎవరూ పట్టించుకోరు. ఆ రోజు జరిగిన కొన్ని కల్పిత ఘటనల చుట్టూ అల్లుకున్న కథ ఇది. సినిమా అన్‌ప్రిడిక్టబుల్‌గా ఉంటుంది.’అని దర్శకుడు రైటర్ మోహన్ పేర్కొన్నారు. ఇంకా అనన్య నాగళ్ల, నిర్మాత వెన్నపూస రమణారెడ్డితోపాటు చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

