Student Teaser | శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా ‘స్టూడెంట్’.. టీజర్ రిలీజ్!
Meghamsh Srihari | దివంగత రియల్ స్టార్ శ్రీహరి వారసుడిగా టాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న యువ హీరో మేఘాంశ్ శ్రీహరి సరికొత్త యాక్షన్ డ్రామా చిత్రం స్టూడెంట్ (Student) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Meghamsh Srihari | దివంగత రియల్ స్టార్ శ్రీహరి వారసుడిగా టాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న యువ హీరో మేఘాంశ్ శ్రీహరి సరికొత్త యాక్షన్ డ్రామా చిత్రం “స్టూడెంట్” (#Student) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. క్యాంపస్ రాజకీయాలు, విద్యార్థి సంఘాల ఘర్షణల నేపథ్యంలో హై-వోల్టేజ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా అధికారిక టీజర్ తాజాగా విడుదలైంది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
ఈ చిత్రంలో మేఘాంశ్ శ్రీహరి పవర్ఫుల్ విద్యార్థి నాయకుడిగా ఇంటెన్స్ మాస్ లుక్‌లో కనిపిస్తూ అలరించనున్నారు. ఈ చిత్రంలో మేఘాంశ్ సరసన విజేత పరీక్ హీరోయిన్గా నటిస్తోంది. జోవికా సినిమాస్ మరియు చెరిష్ మీడియా వర్క్స్ బ్యానర్లపై బెల్లం సిద్ధారెడ్డి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలు తత్వమసి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ్ చంద్ కంచర్ల ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా, శ్రీనివాస్ బెజుగం సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. క్యాంపస్ పాలిటిక్స్, యాక్షన్ మరియు పొలిటికల్ ఎలిమెంట్స్‌తో పాటు చిత్రంలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా హైలైట్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ హింట్ ఇచ్చింది. మేఘాంశ్ శ్రీహరి కెరీర్లో ఇదొక ల్యాండ్‌మార్క్ మూవీ అవుతుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

