‘గొప్ప సినిమా ఇదని తెలుగు ప్రేక్షకులంతా కాలర్ ఎగరేసుకొని చెప్పుకొనేలా ఉంటుంది’ అని అన్నారు సుధీర్‌బాబు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. కరుణకుమార్ దర్శకుడు. విజయ్ చిల్లా, శవిదేవిరెడ్డి నిర్మించారు. ఇటీవల ఈ చిత్రం విడుదలైంది. శనివారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘కంటెంట్‌ను నమ్మి చేసిన సినిమా ఇది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా చేస్తే ఇండస్ట్రీ ప్రోత్సాహం ఉంటుందని నిరూపించింది. తెలుగు ఇండస్ట్రీ గర్వంగా ఫీలయ్యే సినిమా అవుతుంది. ప్రతి షోకు వసూళ్లు పెరుగుతున్నాయి’ అని అన్నారు. ‘ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ టైటిల్‌తో సినిమా చేయడానికి హీరోలకు ధైర్యం కావాలి. సుధీర్‌బాబు కథపై నమ్మకంతోనే అంగీకరించారు’ అని దర్శకుడు చెప్పారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘తెలుగులో వచ్చిన గొప్ప సినిమా ఇదని ఇతర భాషల వారు గర్వంగా మాట్లాడుకునేలా ఉంటుంది. మహిళా ప్రేక్షకుల్ని నిరాశపరచదు’ అన్నారు.