Sri ram: వంద రోజుల జర్నీని చూసి ఎమోషనల్ అయిన శ్రీరామ్

బిగ్ బాస్ సీజన్ 5లో ఇదే చివరి వారం కావడంతో హౌజ్‌ని అందంగా అలంకరించి ఒక్కో హౌజ్‌మేట్ ఎమోషనల్ జర్నీని చూపిస్తున్నారు. మొదటిగా ఫైనల్‌కి చేరిన తొలి ఫైనలిస్ట్ శ్రీరామ్‌ని సర్ ప్రైజ్ చేశారు బిగ్ బాస్. అతడు గార్డెన్ ఏరియాలోకి వచ్చి ఇప్పటివరకు జరిగిన టాస్కుల తాలూకు వస్తువులు చూసి ముచ్చటపడిపోయాడు.
మీ పాటే కాకుండా మాట, ఆటతో లక్షల మందిని పలకరించారు. ఆటలో మీరు చూపించిన పోరాట పటిమ, స్నేహితుల కోసం మీరు నిలబడ్డ తీరు ప్రపంచానికి కొత్త శ్రీరామ్‌ను పరిచయం చేశాయి. ఆట సాగుతున్నకొద్దీ మీకు దగ్గరైనవారు ఒక్కొక్కరిగా మీకు దూరమయ్యారు. ఎంతోమంది మిమ్మల్ని లోన్ రేంజర్ అన్నా మీరు వన్ మ్యాన్ ఆర్మీలా లక్ష్యం వైపు ముందుకెళ్లారు అంటూ జర్నీ వీడియో ప్లే చేశాడు.
తన జర్నీ చూసి శ్రీరామ్ ఎమోషనల్ అయ్యాడు. నా జీవితంలో ఈ రోజును మర్చిపోలేను. నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నాను, బిగ్‌బాస్ నా ఎమోషన్స్‌ను బయటపెట్టగలిగింది.. ఈ జర్నీ నాకు వెరీవెరీ స్పెషల్ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. నీ మనసుకు బాగా దగ్గరైన ఒక ఫొటోను తీసుకెళ్లమని బిగ్‌బాస్ అవకాశమివ్వగా శ్రీరామ్ తన చెల్లితో ఉన్న ఫొటోను తీసుకున్నాడు.
తన జర్నీ చూసి ఎమోషనల్ అయ్యాడు శ్రీరామ్.. నా జీవితంలో చాలా హ్యాపీగా ఉన్న రోజు ఇదే.. తనని ఇంతవరకూ తీసుకుని వచ్చిన ప్రేక్షకులకు పాదాభివందనం చేశారు శ్రీరామ్.. శ్రీరామ చంద్ర మైనంపాటి బిగ్ బాస్ అని నా పేరు పెట్టుకోవాలని ఉంది.. మీ ప్రేమ ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలి.. నేను ఫైనల్‌కి వచ్చానంటే సన్నీ, షణ్ముఖ్‌లు చేసిన హెల్ప్ వల్లే అంటూ అందరికీ థాంక్స్ చెప్పాడు శ్రీరామ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

