బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో 27వ ఎపిసోడ్‌కి చేరుకుంది. హౌజ్‌మేట్స్ మధ్య గిల్లి కజ్జాలు, పోట్లాటలు, అలకలు అనేవి కామన్‌గా మారాయి. శుక్రవారం జరిగిన ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్ విషయంపై కాజల్, శ్వేత మధ్య కాస్త హాట్ హాట్ డిస్కషన్ నడిచింది. అనంతరం రాత్రి అందరు పడుకున్నాడక శ్రీరామ్, హమీదా గాల్లో ముద్దులు పంపుకుంటూ గుడ్ నైట్ చెప్పుకున్నారు.
ఇక నటరాజ్ మాస్టర్..లోబోతో రవి గురించి చర్చించాడు.టాస్క్‌ల సమయంలో నత్తలా కనిపిస్తాడని చెప్పడంతో కోపోద్రిక్తుడైన రవి.. మాస్టర్ చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. జంతువులతో పోల్చడం ఏంటి? అది ఎటో పోతది, నా పేరు ఇంకోసారి ఎత్తొద్దని చెప్పు అంటూ లోబోకు చెప్పాడు.
ఇక ప్రియాంక సింగ్ నల్లచీరలో హోయలు పోతూ సింగర్ శ్రీరామ్ చంద్ర కంట పడింది. దీంతో ఆమెని చూసి షాక్ అయిన శ్రీరామ్ ఓ పాట అందుకొని ఆమె వెనుకాల పడ్డాడు. పింకీ చాలా బాగున్నావ్ అని శ్రీరామ్ అనగా, దానికి ప్రియాంక మురిసిపోయి సిగ్గుపడిపోయింది.