HomeCinemaSreenu Vaitla And Gopichand To Begin Shoot In Italy
ఇటలీలో యాక్షన్
గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సౌత్ ఇటలీలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనువైట్ల పుట్టినరోజు వేడుకను కూడా ఘనంగా జరిపారు.
గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సౌత్ ఇటలీలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనువైట్ల పుట్టినరోజు వేడుకను కూడా ఘనంగా జరిపారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఇటలీలోని మాటెరాలో కొన్ని అద్భుతమైన లొకేషన్లను శ్రీనువైట్ల పరిశీలిస్తున్న వీడియోను నిర్మాత వేణు దోనేపూడి విడుదల చేశారు. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను ఇక్కడ తెరకెక్కిస్తామని, కథ రీత్యా ఎక్కువ భాగం షూటింగ్ విదేశాల్లోనే ఉంటుందని.. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి స్క్రీన్ప్లే: గోపీమోహన్, కెమెరా: కె.వి.గుహన్, సంగీతం: చైతన్ భరద్వాజ్, నిర్మాణం: చిత్రాలయం స్టూడియోస్.