Bellamkonda Wedding | శ్రీవారి సన్నిధిలో బెల్లంకొండ వివాహం.. హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్!
Sreenivasa Kavyanam | టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. కావ్య అనే యువతితో కలిసి ఆయన త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నాడు.
Sreenivasa Kavyanam | టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. కావ్య అనే యువతితో కలిసి ఆయన త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నాడు. తాజాగా వీరికి పెళ్లికి సంబంధించిన ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 29వ తేదీ రాత్రి 11:13 గంటలకు తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారి సాక్షిగా అత్యంత వైభవంగా వీరి వివాహ వేడుక జరగబోతున్నట్లు సమాచారం. సంప్రదాయబద్ధంగా సాగే ఈ వైదిక వేడుక కోసం వధూవరులిద్దరూ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శ్రవణ్ కుమార్ ప్రత్యేకంగా రూపొందించిన వస్త్రాలను ధరించబోతున్నారు.
తిరుమలలో కేవలం కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక ఏకాంతంగా జరగనుంది. అనంతరం మే నెలలో హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు బంధుమిత్రుల కోసం భారీ ఎత్తున రిసెప్షన్ నిర్వహించబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

