Sreemukhi | తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి, సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంది. యాంకర్‌గా అపారమైన అభిమానాన్ని సంపాదించుకున్న ఆమె.. వెండితెరపై మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయింది. అయినప్పటికీ తనకు వచ్చిన ప్రతి పాత్రను ప్రత్యేకంగా మలుచుకుంటూ నటిగా కూడా తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది.ఇప్పటికే ‘జులాయి’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘భోళా శంకర్’ వంటి చిత్రాల్లో నటించిన శ్రీముఖి.. ‘క్రేజీ అంకుల్స్’ సినిమాలో ప్రధాన పాత్రలోనూ కనిపించింది. అయితే ఆమె ప్రతిభకు తగిన స్థాయిలో అవకాశాలు రాలేదనే అభిప్రాయం సినీ వర్గాల్లో ఉంది.
తాజాగా సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ సినిమాలో శ్రీముఖి కీలక పాత్రలో నటించింది. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో సమంతకు తోడికోడలిగా, ఆ ఇంటి చిన్న కోడలిగా శ్రీముఖి కనిపించింది. ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అమాయకత్వం, చిన్నపాటి అసూయ, కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో కూడిన పాత్రలో శ్రీముఖి సహజ నటనతో ఆకట్టుకుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సమంతతో కలిసి చేసిన సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సాధారణంగా ఒక సినిమా విజయం సాధిస్తే హీరో, హీరోయిన్ల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. కానీ ‘మా ఇంటి బంగారం’ విషయంలో మహిళా పాత్రల గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. శ్రీముఖితో పాటు మంజూష ముక్కవిల్లి పాత్రకు కూడా మంచి స్పందన వస్తోంది.
ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి తరచూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. తాజాగా ‘మా ఇంటి బంగారం’ సినిమాకు సంబంధించిన ఓ రీల్‌పై ఆమె చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.ఒక గృహిణి తన భర్తతో కలిసి చేసిన వీడియోలో, “శ్రీముఖి గారూ.. మీరైనా కామెంట్ చేయండి. మా ఆయన్ని సినిమాకు తీసుకెళ్లమని చెప్పండి” అని కోరింది. ఈ వీడియోను చూసిన శ్రీముఖి సరదాగా “తీసుకెళ్లండి పాపం” అంటూ కామెంట్ చేసింది. అలాగే ఒక లవ్ ఎమోజీని కూడా షేర్ చేసింది.శ్రీముఖి కామెంట్ చేసిన కొద్ది సేపటికే ఆ కామెంట్‌కు వేల సంఖ్యలో లైక్స్ రావడం విశేషం. వీడియో పోస్ట్ చేసిన జంట కూడా ఆనందం వ్యక్తం చేస్తూ, “థ్యాంక్యూ మేడమ్.. మీరు స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది” అంటూ రిప్లై ఇచ్చారు. అంతేకాకుండా, “శ్రీముఖి గారు చెప్పారుగా.. ఇప్పుడు తీసుకెళ్లాల్సిందే. ‘మా ఇంటి బంగారం’ను మా ఇంటి బంగారానికి చూపిస్తాను” అంటూ ఆ గృహిణి భర్త సరదాగా స్పందించాడు. ఈ సంభాషణ మొత్తం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.