Sreemukhi | తెలంగాణ ఫోక్ సాంగ్ ‘యేషనాగుల కట్టమీద’ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎన్నో ఏళ్ల క్రితమే ఈ పాట విడుదలైనప్పటికీ.. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాలో ఈ పాటను కొత్తగా ఉపయోగించడంతో మరోసారి ఈ ఫోక్ సాంగ్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. కొద్ది రోజుల క్రితమే విడుదలైన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. అదిరిపోయే తెలంగాణ ఫోక్ లిరిక్స్, దుమ్మురేపే మాస్ బీట్‌కు తోడు నాని, కీర్తి సురేష్ వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు ‘యేషనాగుల కట్టమీద’ పాటకు మరింత హైప్ తీసుకొచ్చాయి.
పాట విడుదలైన కొద్దిరోజుల్లోనే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వెళ్లింది. అంతేకాదు.. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ పాటకు సంబంధించిన రీల్స్, డ్యాన్స్ వీడియోలు వరుసగా దర్శనమిస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఈ ఫోక్ బీట్‌కు స్టెప్పులేస్తూ తమ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రెండింగ్‌లో స్టార్ యాంకర్ శ్రీముఖి కూడా చేరిపోయింది. ‘యేషనాగుల కట్టమీద’ పాటకు తనదైన స్టైల్లో మాస్ స్టెప్పులు వేసి ఆకట్టుకుంది. జిమ్‌కు వెళ్లిన శ్రీముఖి అక్కడే ఈ పాటకు డ్యాన్స్ చేసింది. వైట్ కలర్ టీషర్ట్, బ్లూ కలర్ మినీ షార్ట్స్‌తో పాటు పోనీటైల్ లుక్‌లో కనిపించిన ఆమె.. పాటకు తగ్గట్టుగా ఎనర్జిటిక్ స్టెప్పులతో అదరగొట్టింది.
‘సెప్టెంబర్ ఎనర్జీ’ అంటూ ఈ డ్యాన్స్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం శ్రీముఖి చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.శ్రీముఖి డ్యాన్స్ చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘బుల్లితెర రాములమ్మ అదరగొట్టేసింది’, ‘మాస్ స్టెప్పులతో అదరగొట్టారు’, ‘ఎనర్జీ లెవల్స్ వేరే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఫోక్ బీట్‌కు శ్రీముఖి వేసిన స్టెప్పులు పాటలోని మాస్ ఎనర్జీకి సరిగ్గా సరిపోయాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. శ్రీముఖి ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతోంది. ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఇటీవల ‘బిగ్ బాస్ అగ్ని పరీక్ష’ సీజన్ 2కు కూడా హోస్ట్‌గా వ్యవహరించి ఆకట్టుకుంది.టీవీ షోలతో పాటు సినిమా ఈవెంట్లను కూడా హోస్ట్ చేస్తూ శ్రీముఖి బిజీగా ఉంది. యాంకర్‌గా మాత్రమే కాకుండా నటిగానూ అప్పుడప్పుడు ప్రేక్షకులను పలకరిస్తోంది.