Sreeleela | కృతి శెట్టి బాటలోనే శ్రీలీల పయనిస్తుందా… ఒకప్పుడు గోల్డెన్ లెగ్, ఇప్పుడు ఐరెన్ లెగ్..!
Sreeleela | ఇటీవలి కాలంలో హీరోయిన్స్‌కి లక్ అనేది ఎక్కువ రోజులు ఉండడం లేదు. రెండు మూడు వరుస హిట్స్‌తో గోల్డెన్ లెగ్గా పేరు తెచ్చుకున్న ఈ భామలు ఆ తర్వాత వరుస ఫ్లాపులు దక్కించుకొని కెరీర్ సందిగ్ధంలో పడేలా చేసుకుంటున్నారు
Sreeleela | ఇటీవలి కాలంలో హీరోయిన్స్‌కి లక్ అనేది ఎక్కువ రోజులు ఉండడం లేదు. రెండు మూడు వరుస హిట్స్‌తో గోల్డెన్ లెగ్గా పేరు తెచ్చుకున్న ఈ భామలు ఆ తర్వాత వరుస ఫ్లాపులు దక్కించుకొని కెరీర్ సందిగ్ధంలో పడేలా చేసుకుంటున్నారు. రకుల్,తమన్నా, పూజా హెగ్డే, కృతి శెట్టి వంటి వారు ఒకప్పుడు ఊపేశారు. కాని ఇప్పుడు వారికి అవకాశాలే కరువయ్యాయి. ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన కృతి శెట్టి అదే జోరును కొనసాగిస్తూ హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకుంది. అందంతో పాటు అదృష్టం కూడా ఉందని అంతా అనుకున్నారు.
కానీ ఆ తరువాతనే కృతి శెట్టికి పరాజయాలు పలకరించాయి . గ్లామర్ విషయంలో వంకబెట్టవలసిన పనిలేదు. డాన్స్ విషయంలోను ఈ బ్యూటీ శభాష్ అనిపించుకుంది. ఇక ఈ ట్రెండ్ కి తగ్గట్టు యాక్టింగ్‌తో అదరగొడుతుంది. కానీ దురదృష్టం కొద్దీ ఆమెను ఫ్లాపులు పలకరించడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. దాంతో తమిళ .. మలయాళ సినిమాలపై శ్రద్ధ పెట్టింది. ఇప్పుడు ఇదే రూట్లో శ్రీలీల పోతున్నట్టుగా కనిపిస్తుంది. తెలుగులో వరుస హిట్లతో అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న శ్రీలీల బిజీ హీరోయిన్గా మారింది. అవకాశాలు పలకరిస్తూ ఉన్నా కూడా అవన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర తేలిపోతున్నాయి.
స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రార్టినరీ మ్యాన్ ఇలా శ్రీలీల నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఆ తర్వాత వచ్చిన గుంటూరు కారం సినిమాతో ఓ హిట్ పడింది. కానీ ఈ సినిమా శ్రీలీలకు అంత ప్లస్ కాలేదు. పుష్ప 2లో కిస్సిక్ పాటతో కాస్త అలరించింది. ఇక ఇటీవల నితిన్ హీరోగా తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ మధ్య కాలంలో శ్రీలీలకి హిట్ అనేదే పడడం లేదు. ఇలానే చేసుకుంటూ పోతే కెరీర్లో పట్టుమని పది సినిమాలు కూడా చేయకుండానే ఫేడ్ అవుట్ కావల్సి వస్తుంది. ఇప్పటికైన శ్రీలీల జాగ్రత్త పడాలి. త్వరలో రవితేజతో కలిసి మాస్ జాతర అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించనుంది. కార్తీక్ ఆర్యన్ సరసన డెబ్యూ చేస్తూ నటిస్తున్న బాలీవుడ్ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. దీని మీద అమ్మడికి చాలా ఆశలున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

