Sreeleela | శ్రీలీల–తిలక్ వర్మ డేటింగ్ వార్తలపై క్లారిటీ.. “అవన్నీ పుకార్లే” అంటూ తల్లి స్వర్ణలత కామెంట్
Sreeleela |నటి శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలు ఇటీవల మరింత వేగంగా వ్యాప్తి చెందడంతో ఈ అంశంపై శ్రీలీల తల్లి స్వర్ణలత స్పందిస్తూ పూర్తి స్పష్టత ఇచ్చారు. ప్రచారంలో ఉన్న కథనాలను ఆమె పూర్తిగా ఖండిస్తూ, వాటిలో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు.
Sreeleela |నటి శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలు ఇటీవల మరింత వేగంగా వ్యాప్తి చెందడంతో ఈ అంశంపై శ్రీలీల తల్లి స్వర్ణలత స్పందిస్తూ పూర్తి స్పష్టత ఇచ్చారు. ప్రచారంలో ఉన్న కథనాలను ఆమె పూర్తిగా ఖండిస్తూ, వాటిలో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు. స్వర్ణలత మాట్లాడుతూ, ఇలాంటి కథనాలు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కావడం లేదని అన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో అణువంత కూడా వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం శ్రీలీల తన సినీ కెరీర్‌తో పాటు చదువులపైనా సమానంగా దృష్టి పెడుతోందని వెల్లడించారు.
ఆమె చెప్పిన వివరాల ప్రకారం, సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ సమయం దొరికినప్పుడల్లా శ్రీలీల తన వైద్య విద్యకు సంబంధించిన చదువులపై దృష్టి పెడుతోందని చెప్పారు. ముఖ్యంగా నీట్-పీజీ పరీక్ష కోసం ప్రత్యేకంగా సన్నద్ధమవుతోందని తెలిపారు. వ్యక్తిగత విషయాల గురించి ఆలోచించే దశ ఇంకా రాలేదని, దానికి మరో ఐదు నుంచి ఆరు సంవత్సరాల సమయం ఉందని వ్యాఖ్యానించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని సంఘటనల గురించీ ఆమె వివరణ ఇచ్చారు. 2025 డిసెంబర్లో శ్రీలీల, తిలక్ వర్మ కలిసి తిరుమల దర్శనం చేసుకున్నారని, అలాగే వాంఖడే స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో శ్రీలీల కనిపించడం వంటి అంశాలను ఆధారంగా తీసుకుని ఊహాగానాలు సృష్టించారని పేర్కొన్నారు. అయితే ఇవన్నీ యాదృచ్ఛిక సంఘటనలేనని, వాటికి ఇతర అర్థాలు వెతకవద్దని సూచించారు.
ఇదే తరహాలో గతంలో కూడా శ్రీలీల వ్యక్తిగత జీవితంపై పలు కథనాలు వచ్చిన విషయాన్ని స్వర్ణలత గుర్తుచేశారు. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్‌తో రిలేషన్లో ఉన్నారన్న వార్తలను కూడా అప్పట్లో ఖండించినట్లు చెప్పారు. ఆ సందర్భాన్ని వివరిస్తూ, కార్తిక్ ఆర్యన్ తల్లి మరియు తాను ఇద్దరూ గైనకాలజిస్టులమని, వృత్తిపరమైన పరిచయం మాత్రమే ఉందని తెలిపారు. ఆ పరిచయాన్ని తప్పుగా అర్థం చేసుకుని మీడియాలో అనవసరమైన రిలేషన్షిప్ కథనాలు సృష్టించారని పేర్కొన్నారు. ఇటీవల సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఆధారాలు లేకుండానే సోషల్ మీడియాలో ప్రచారం పెరుగుతున్న నేపథ్యంలో, ఇలాంటి పుకార్లను నమ్మకూడదని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dead Bodies | ప్రకాశం జిల్లాలో కలకలం..బీచ్‌కు కొట్టుకువచ్చిన నాలుగు మృతదేహాలు
Health tips | నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతోందా.. అయితే ఉదయాన్నే ఈ పని చేయండి..!
Kodangal | కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌లో వలస కూలీల తిరుగుబాటు.. నిర్మాణ సంస్థపై తీవ్ర ఆరోపణలు
Miss behave | బాలికకు బొమ్మలిస్తానని నమ్మించి అసభ్య ప్రవర్తన
Collector Kumar Deepak | ప్రభుత్వ భూములు కాపాడేందుకు చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

