ఆమె ఒక మెరుపు.. ఒక పటాక..
తెలుగందం శ్రీలీలను అద్భుతమైన అవకాశం వరించింది.
తెలుగందం శ్రీలీలను అద్భుతమైన అవకాశం వరించింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా, అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో నటలోకనాయకుడు కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ కలిసి నిర్మిస్తున్న ‘ధర్మన్’ సినిమాలో ఆమె కీలకపాత్ర పోషిస్తున్నది. గత కొన్ని రోజులుగా ‘ధర్మన్’లో శ్రీలీల నటిస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా చిత్రబృందం ధృవీకరించింది. ఈ సందర్భంగా శ్రీలీలకు స్వాగతం పలుకుతూ, ఈ సినిమాలోని ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్‌ని బుధవారం మేకర్స్ విడుదల చేశారు.
ఈ గ్లింప్స్‌లో శ్రీలీల ఆకట్టుకునే అవతారంలో కనిపించి, సినిమాపై ఆసక్తిని పెంచారు. అనిరుథ్ రవిచందర్ అందించిన క్లాసికల్ మ్యూజిక్ ఆమె పరిచయ సన్నివేశాలకు మరింత అందాన్ని తెచ్చింది. ‘She’s the spark and she’s the pataka’ అనే క్యాప్షన్ శ్రీలీల పాత్ర సినిమాలో ఎంత సందడి చేయనున్నదో తెలియజేస్తున్నది. డెడ్లీ డాక్టర్‌గా మిస్టీరియస్ పాత్రలో రజనీకాంత్ నటిస్తున్న ఈచిత్రంలో నయనతార కథానాయిక. ఈ చిత్రానికి కెమెరా: నికేత్ బొమ్మి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

