అచ్చ తెలుగందం శ్రీలీలకు యువతరంలో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అందుకే ఈ అమ్మడు విజయాలతో సంబంధం లేకుండా భారీ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నది. అదే సమయంలో గత కొంతకాలంగా ఈ భామ వ్యక్తిగత జీవితం గురించి రూమర్లు రావడం పరిపాటిగా మారింది. తాజాగా క్రికెటర్ తిలక్‌వర్మతో ఈ ఆమె డేటింగ్లో ఉందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నది. గత డిసెంబర్లో వీరిద్దరూ తిరుమలను సందర్శించడం, ఆపై ముంబయిలో టీ20 మ్యాచ్‌ను తిలకించడంతో డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. తాజాగా వీటిపై శ్రీలీల తల్లి స్వర్ణలత స్పందించారు.
ఇవన్నీ కేవలం పుకార్లేనని, వాటిలో ఎలాంటి వాస్తవం లేదని, ప్రస్తుతం శ్రీలీల కెరీర్ మీదనే దృష్టి పెట్టిందని వివరణ ఇచ్చారు. మరో ఐదేళ్ల తర్వాతే తన కూతురు పెళ్లి గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశారు. గతంలో బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్‌తో శ్రీలీల డేటింగ్లో ఉందనే ప్రచారం కూడా జరిగింది. ఈ వార్తలను కూడా స్వర్ణలత ఖండించారు. తానూ, కార్తిక్ ఆర్యన్ తల్లి ఇద్దరం గైనకాలజిస్టులం కావడంతో వృత్తిపరంగా కలుసుకొని అనేక విషయాలు మాట్లాడుకుంటామని, దీనిని కారణంగా చూపించి కార్తిక్ ఆర్యన్, శ్రీలీల మధ్య రిలేషన్షిప్ వార్తలను సృష్టించారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.