నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం
‘దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు రెండు గంటల పాటు పగలబడి నవ్వుతూనే ఉన్నా. అంత అద్భుతంగా అనిపించింది. ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్స్‌లో హాయిగా ఎంజాయ్ చేసే సినిమా ఇది’ అన్నారు అగ్ర నిర్మాత అల్లు అరవింద్.
‘దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు రెండు గంటల పాటు పగలబడి నవ్వుతూనే ఉన్నా. అంత అద్భుతంగా అనిపించింది. ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్స్‌లో హాయిగా ఎంజాయ్ చేసే సినిమా ఇది’ అన్నారు అగ్ర నిర్మాత అల్లు అరవింద్. ఆయన సమర్పణలో రూపొందిన చిత్రం ‘సింగిల్’. శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా జంటగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్‌రాజు దర్శకుడు. విద్యా కొప్పినీడి, భానుప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మాతలు. మే 9న విడుదలకానుంది.
సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ముక్కోణపు ప్రేమకథా నేపథ్యంలో ట్రైలర్ ఆసాంతం నవ్వుల్ని పంచింది. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ..ప్రేక్షకుల్ని ఇరగబడి నవ్వించాలనే లక్ష్యంతో ఈ సినిమా చేశామని, రెండున్నర గంటలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని అన్నారు. ప్రేక్షకుల్ని పొట్టచెక్కలయ్యేలా నవ్వించే చిత్రమిదని, గీతా ఆర్ట్స్‌లో కామెడీ సినిమాలు ఎప్పుడూ ఫెయిల్ కాలేదని నిర్మాత బన్నీ వాసు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ చిత్రానికి విశాల్‌చంద్రశేఖర్ సంగీతాన్నందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

