Squid Game: The Challenge | ఓటీటీలలో వెబ్ సిరీస్‌లు చూసేవారికి పరిచయం అక్కర్లేని లేని సిరీస్ స్క్విడ్ గేమ్ (Squid Game). ఓటీటీల మీద కొద్దిగా అవగాహన ఉన్నవారు కూడా దీని పేరు ఎక్కడో ఒక చోట వినే ఉంటారు. మనీ హెయిస్ట్, స్ట్రేంజర్ థింగ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, బ్రేకింగ్ బ్యాడ్ వంటి ఫాలోయింగ్ ఈ సిరీస్‌కు కూడా ఉంది. 2021 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన ఈ వెబ్ సిరీస్ చాలా పెద్ద హిట్టయింది. రిలీజ్ అయిన కేవలం 28 రోజుల్లో ఈ సిరీస్‌ను ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు చూశారు. ఇక ఈ సిరీస్‌లో వయొలెన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ప్రేక్షకులకు బాగానే చేరువైంది. కాగా..ప్రస్తుతం స్క్విడ్ గేమ్‌కు సెకండ్ సీజన్ (Squid Game Season 2) రెడీ అవుతోంది. అయితే, తాజాగా ఈ సెకండ్ సీజన్‌కు సంబంధించిన అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు.
స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్ అనే పేరుతో రానున్న ఈ సెకండ్ సీజన్‌కు సంబంధించి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్లో $4.56 మిలియన్ల ప్రైజ్ మనీ కోసం 456 మంది రియల్ పీపుల్ పోటీ పడుతున్నట్లు టీజర్ చూపిస్తుంది. నవంబర్ 22 నుంచి ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు.
456 real people.
4.56 million dollars.
Squid Game: The Challenge begins November 22. pic.twitter.com/bxu0wSBNr5— Netflix (@netflix) September 22, 2023
ఇక మొదటి సీజన్లో కనిపించిన లీ జంగ్ జే, లీ బ్యుంగ్ హున్, వి హా జున్, గాంగ్ యూ… రెండో సీజన్లో కూడా నటించనున్నారు. వీరితో పాటు యిం సి వాన్, కాంగ్ హా న్యూల్, పార్క్ సంగ్ హూన్, యాంగ్ డాంగ్ గ్యూన్ స్క్విడ్ గేమ్ నటుల్లో కొత్తగా చేరారు. ఇదిలా ఉండగా.. స్క్విడ్ గేమ్ సీజన్ 1 నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు సృష్టించింది. కేవలం 28 రోజుల్లోనే 1.65 బిలియన్ గంటల వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది. అంతేకాదు పలు అవార్డులను కూడా స్క్విడ్ గేమ్ సాధించింది. ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డుల్లో 14 నామినేషన్లను పొందింది. ఆరు అవార్డులను గెలుచుకుంది.