Squid Game S3 Trailer | ‘స్క్విడ్‌గేమ్ 3’ ట్రైలర్ విడుదల.. ఉత్కంఠ రేపుతున్న చివరి సీజన్!
Squid Game S3 | ప్రపంచాన్ని ఊపేసిన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'స్క్విడ్‌గేమ్' మూడో సీజన్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.
Squid Game S3 | ప్రపంచాన్ని ఊపేసిన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్‌గేమ్’ మూడో సీజన్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఎంతో మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చివరి సీజన్ జూన్ 27, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుండగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. కథానాయకుడు సియోంగ్ గీ-హున్ (లీ జంగ్-జే) ఈ ప్రాణాంతక ఆటకు ఎలా ముగింపు పలుకుతాడు, ఈ గేమ్ వెనుక ఉన్న ఫ్రంట్ మ్యాన్‌ను కనిపెట్టాడా లేదా అనే అంశాలు ప్రధానంగా చూపించనున్నారు. మొదటి రెండు సీజన్లలో భారీ విజయాన్ని సాధించిన ఈ కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, తెలుగుతో పాటు అనేక భారతీయ భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది. ఈ చివరి సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్‌కు హ్వాంగ్ డాంగ్ హ్యుక్ దర్శకత్వం వహించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

