Vikrant Rona | విజువల్ వండర్‌గా ‘విక్రాంత్ రోన’ ట్రైలర్!
Vikrant Rona Trailer | కన్నడ హీరో సుదీప్ కిచ్చా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రక్తచరిత్ర’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుదీప్ ‘ఈగ’ సినిమాతో తెలుగులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తరువాత వరుసగా ‘బాహుబలి’, ‘సైరా’ వంటి పాన్ ఇండియా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఈయన రెండు సినిమలను సెట్స్‌పై ఉంచాడు. అందులో ‘విక్రాంత్ రోనా’ ఒకటి. అనూప్ భందారి దర్శకత్వం వహించాడు. గతేడాది జూలైలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. కాగా ఇటీవలే మేకర్స్ జూలై 28న విడుదల చేస్తున్నట్లు ప్రకటన ఇచ్చారు. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తుంది. తాజాగా రామ్‌చరణ్ ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశాడు.
‘ఆ ఊరే ఒక మర్మమైన ఊరు.. ఆ ఊరి ప్రజలు ఏదో ఒక భయంకరమైన కథను దాచాలనుకుంటున్నారు. కథను దాచగలరు, కానీ భయాన్ని దాచలేరు. ఆ కథ మళ్ళీ మొదలైంది. ఆ డెవిల్ మళ్ళీ వచ్చాడు’ అంటూ ట్రైలర్ మొదలవుతుంది. ‘భయం నిండిన ఊరిలో భయం అంటే ఏంటో తెలియని ఒకడొచ్చాడు’ అంటూ హీరో ఎంట్రీ ఆకట్టుకుంటుంది. ‘అతనొచ్చిన తర్వాత ఆ భయంకరమైన కథలో ఒక కొత్త అధ్యాయం ఆరంభమైంది’ అంటూ వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. సుదీప్ స్క్రీన్ ప్రజెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌నెస్‌తో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విలియమ్ డేవిడ్ కెమెరా విజువల్స్ వేరే లెవల్లో ఉన్నాయి. అజనీష్ లోక్నాత్ నేపథ్య సంగీతం గూస్ బంప్స్ క్రియేట్ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచాయి.
ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని షాలిని ఆర్ట్స్, ఇన్వేనియో ఫిలింస్ ఇండియా సంస్థలతో కలిసి సుదీప్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. నిరూప్ భందారి, బాలీవుడ్ భామ జాక్వెలీన్ ఫెర్నాండెజ్ కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రం కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. కాగా హిందీ వెర్షన్ ట్రైలర్‌ను సల్మాన్ ఖాన్ విడుదల చేశాడు.
Wishing @KicchaSudeep garu all the very best !! #VikrantRonatrailer looks quite exciting! 🥂
Here’s the Telugu Trailer : https://t.co/eEHhOILSMz@anupsbhandari @JackManjunath @shaliniartss @InvenioF @ZeeStudios_ @laharimusic @neethaofficial @Asli_Jacqueline
— Ram Charan (@AlwaysRamCharan) June 23, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

