నిఖిల్ నటిస్తున్న కొత్త సినిమా ‘స్పై’. గ్యారీ బీహెచ్ దర్శకుడు. కె రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. జూన్ 29న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో ‘దేశం దాచిన అతిపెద్ద రహస్యాన్ని చేధించేందుకు జరిగే పోరాటమిది’ అనే క్యాప్షన్ రాశారు. సుభాష్ చంద్రబోస్ ప్రసిద్ధమైన నినాదం ‘మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను’ ఈ వీడియోలో ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యానికి కారణాలను ఇన్వెస్టిగేట్ చేస్తూ ఈ కథ సాగనున్నట్లు తెలుస్తున్నది.