కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఒక షెడ్యూల్. రెండు నెలలు పాటు సాగే ఈ షెడ్యూల్లో ప్రభాస్, వివేక్ ఒబేరాయ్ మధ్య భారీ పోరాటాలు.. ఈ వార్తను బట్టి ‘స్పిరిట్’లో యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ‘స్పిరిట్’ షూటింగ్‌కి కొన్ని రోజుల క్రితం విరామాన్ని ప్రకటించిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా త్వరలో కొత్త షెడ్యూల్‌ని మొదలుపెట్టబోతున్నారు. ఇక ఈ షెడ్యూల్ అంతా యాక్షనే అనే వార్త ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశమైంది. సందీప్‌రెడ్డి సినిమాల్లో ఎమోషన్స్ ఎంత గొప్పగా ఉంటాయో, ఇంటెన్స్ క్యారెక్టరైజేషన్స్, రా యాక్షన్ ఎలిమెంట్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి.
‘స్పిరిట్’కోసం అదే శైలిని మరింత భారీగా ఆవిష్కరించబోతున్నారు సందీప్‌రెడ్డి వంగా. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అదీ సందీప్‌రెడ్డి వంగా స్టైల్ పోలీస్ అంటే ఇక చెప్పేదేముంది! థియేటర్లలో జాతరే. ప్రభాస్ హీరోయిజం. వివేక్ ఒబేరాయ్ విలనిజం.. అభిమానులకు గూజ్బంప్స్ తెప్పిస్తాయనడంలో సందేహం లేదు.
భారతీయ సినిమా చరిత్రలోనే ఒక డిఫరెంట్ యాక్షన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ‘స్పిరిట్’ అని మేకర్స్ చెబుతున్నారు. త్రిప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్దన్ రామేశ్వర్, నిర్మాతలు: ప్రణయ్‌రెడ్డి వంగా, భూషణ్‌కుమార్, క్రిషన్ కుమార్, నిర్మాణం: భద్రకాళి పిక్చర్స్, టి-సిరీస్.