Spirit Movie | స్పిరిట్ సినిమాపై బిగ్ అప్డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే..!
Spirit Movie | బాహుబలి-2 వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు కమిట్ అయ్యాడు ప్రభాస్. అనుకున్న టైమ్‌కు వాటిని రిలీజ్ చేస్తూ వస్తున్నాడు కూడా. అయితే బాహుబలి తర్వాత ఇప్పటివరకు డార్లింగ్‌కు ఆ రేంజ్ హిట్టు మరోటి పడలేదు.
Spirit Movie | బాహుబలి-2 వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు కమిట్ అయ్యాడు ప్రభాస్. అనుకున్న టైమ్‌కు వాటిని రిలీజ్ చేస్తూ వస్తున్నాడు కూడా. అయితే బాహుబలి తర్వాత ఇప్పటివరకు డార్లింగ్‌కు ఆ రేంజ్ హిట్టు మరోటి పడలేదు. సాహోకు నార్త్ ఆడియెన్స్ పట్టం కట్టినా.. సౌత్‌లో మాత్రం తీవ్ర నష్టాల్ని మిగిల్చింది. ఇక రాధేశ్యామ్ సినిమా ప్రభాస్ కెరీర్లో అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాగా వరస్ట్ రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఎన్నో వాయిదాల తర్వాత ఈ ఏడాది రిలీజైన ఆదిపురుష్ సినిమాకు ట్రోల్స్‌లో ఎన్ని రకాలుంటాయో అన్ని వాడేవారు నెటిజన్లు. రామాయణం కథను కించపరిచాడని కామెంట్స్ చేశారు.
ఇక ప్రస్తుతం ప్రభాస్ ఆశలన్నీ సలార్ పైనే ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఆ రేంజ్ హిట్టు సలారే తెచ్చిపెడుతుందని అందరూ ధీమాగా ఉన్నారు. అయితే అనూహ్యంగా సలార్ కూడా పోస్ట్ పోన్ అయింది. ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ డేట్‌పై క్లారిటీ లేదు. దీనితో పాటుగా ప్రభాస్.. కల్కి, మారుతితో హార్రర్ సినిమా చేస్తున్నాడు. ఇవి రెండు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. కాగా ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సగటు ఆడియెన్ సైతం అమితాసక్తితో చూస్తున్న ప్రాజెక్ట్ స్పిరిట్. సందీప్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాపై జనాల్లో మాములు అంచనాల్లేవు.
పైగా ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారి పోలిస్ గెటప్ వేయనున్నాడు. మాములుగానే సందీప్ రెడ్డి తన సినిమాల్లో హీరోల క్యారెక్టర్‌ను యాంగర్ టోన్‌లో రాసుకుంటుంటాడు. అంటే వీళ్లకు కోపం ముక్కుమీదే ఉంటుంది. అలాంటిది పోలిసు పాత్రలో ఇంకేంత యాంగర్‌గా చూపించబోతున్నాడో అని అప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ ఊహల్లోకి తేలిపోతున్నారు. ప్రస్తుతం సందీప్‌తో యానిమల్ సినిమా చేస్తున్నాడు. డిసెంబర్ 1న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై నార్త్ సహా సౌత్ ఆడియెన్స్‌లో కూడా మంచి హైపే నెలకొంది.
ఇక ఈ సినిమా పూర్తవ్వగానే సందీప్ రెడ్డి స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయబోతున్నాడట. ఇక ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది జూన్ నుంచి ప్రారంభించబోతున్నట్లు చ్రిత నిర్మాత భూషణ్ కుమార్ వెల్లడించాడు. ఈ వార్తతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రుద్రమదేవి వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు కృషి’
Ritabrata Banerjee | టీఎంసీ రెబల్ వర్గానికి షాక్.. రిటాబ్రత బెనర్జీ ప్రతిపక్ష నేత హోదాను రద్దు చేసిన హైకోర్టు
RC17 Casting Call | రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో నటించాలనుందా?.. క్యాస్టింగ్ కాల్ ప్రకటించిన మేకర్స్!
‘ఉద్యాన క్షేత్రాల్లో ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకోవాలి’
ACB Raids | మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇంజినీర్లు
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

