బాక్సాఫీసు బద్దలు కొడుతున్న స్పైడర్‌మ్యాన్:నో వే హోమ్.. వంద కోట్ల డాలర్లు వసూల్

హైదరాబాద్: మహమ్మారి వేళ స్పైడర్‌మ్యాన్ ఇరగదీస్తున్నాడు. కోవిడ్ సమయంలోనూ బాక్సాఫీసును కొల్లగొడుతున్నాడు. స్పైడర్‌మ్యాన్ సిరీస్‌లో భాగంగా కొత్తగా రిలీజైన స్పైడర్‌మ్యాన్.. నో వే హోమ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్లు వసూల్ చేసింది. వంద కోట్ల డాలర్లు వసూల్ చేసిన ఈ యేటి తొలి సినిమాగా స్పైడర్‌మ్యాన్ రికార్డు క్రియేట్ చేసింది. 2021లో అత్యధిక కలెక్షన్లు సంపాదించిన టైటిల్‌ను ఈ సినిమా ఎగురేసుకుపోయింది. కొరియా యుద్ధ నేపథ్యంలో వచ్చిన ద బ్యాటిల్ ఆఫ్ లేక్ ఛాంగ్జిన్ కలెక్షన్లను కూడా స్పైడర్‌మ్యాన్ దాటేసింది. ఆ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 905 మిలియన్ల డాలర్లు వచ్చాయి. 2019లో చివరిసారి స్టార్ వార్స్.. ద రైజ్ ఆఫ్ స్కైవాకర్ చిత్రం బిలియన్ డాలర్ల వసూళ్లను అందుకున్నది. స్టార్ వార్స్ తర్వాత బాక్సాఫీసులో దుమ్మురేపిన సినిమా జాబితాలో స్పైడర్‌మ్యాన్ నిలిచింది. రెండేళ్ల నుంచి కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా సినిమా హాళ్లు మూసుకున్న విషయం తెలిసిందే. ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా వరకు కష్టాల్లోకి వెళ్లిపోయింది. ఇక ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమ కోలుకుంటోంది. మార్వెల్ సంస్థ నిర్మించిన స్పైడర్‌మ్యాన్.. నో వే హోమ్‌కు మాత్రం కనకవర్షం కురుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద సినీ మార్కెట్ అయిన చైనాలో.. ఇంకా స్పైడర్‌మ్యాన్ సినిమాను రిలీజ్ చేయలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

