దక్షిణాది హీరోలు గ్రేట్!

బాలీవుడ్ అగ్ర కథానాయిక కంగనారనౌత్‌ను నిత్య వివాదాల సహచరిగా అభివర్ణిస్తారు. భవిష్యత్తు పరిణామాలకు ఏమాత్రం భయపడకుండా తన మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేయడం ఆమె నైజం. తాజాగా ఈ భామ ఇన్స్టాగ్రామ్ వేదికగా దక్షిణాది హీరోల్ని ప్రశంసలతో ముంచెత్తింది. పరోక్షంగా హిందీ చిత్రసీమను ఎద్దేవా చేస్తూ కంగనా ఈ పోస్ట్ చేసిందని భావిస్తున్నారు. కన్నడస్టార్ యష్, తెలుగు అగ్రహీరో అల్లు అర్జున్ ఫొటోలతో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో కంగనారనౌత్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇందులో ఆమె దక్షిణాది హీరోల గొప్పతనానికి కారణాలేమిటో వివరించింది. ‘దక్షిణాది హీరోలు తమ సంస్కృతి మూలాల్ని బాగా ప్రేమిస్తారు. మానవ సంబంధాల పట్ల మమకారాన్ని కనబరుస్తూ తమ కుటుంబాల్ని ప్రేమిస్తారు. పాశ్చాత్య సంస్కృతికి పూర్తి దూరంగా ఉంటారు. వృత్తిపట్ల వారి అంకితభావం, తపన అనితరసాధ్యం’ అని కంగనా కొనియాడింది. హిందీ చిత్రసీమలోని బంధుప్రీతి, పురుషాధిక్యంపై ఎప్పటినుంచో యుద్ధం చేస్తున్న కంగనారనౌత్ సమయం దొరికినప్పుడల్లా బాలీవుడ్‌పై విరుచుకుపడుతుంటుంది. ఈ వరుసలోనే హిందీ పరిశ్రమకు అన్యాపదేశంగా చురకలంటిస్తూ కంగనా తాజా పోస్ట్ చేసిందని భావిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

