Sonu Sood | రియల్ హీరోని హెచ్చరించిన రైల్వే అధికారులు.. ఎందుకంటే..?
బాలీవుడ్ స్టార్ నటుడు, రియల్ హీరో సోనూసూద్‌ను రైల్వే అధికారులు సున్నితంగా హెచ్చరించారు. ఇటీవల ఆయన పోస్టు చేసిన ఓ వీడియోనే ఇందుకు కారణమైంది. డిసెంబర్ 13వ తేదీన సోనూసూద్ ట్విట్టర్లో ఓ వీడియో పోస్టు చేశారు. అందులో కదులుతున్న రైల్లో సోనూసూద్ ఫుట్ బోర్డుపై అజాగ్రత్తగా ప్రయాణిస్తూ కనిపించారు.
Sonu Sood | బాలీవుడ్ స్టార్ నటుడు, రియల్ హీరో సోనూసూద్‌ను రైల్వే అధికారులు సున్నితంగా హెచ్చరించారు. ఇటీవల ఆయన పోస్టు చేసిన ఓ వీడియోనే ఇందుకు కారణమైంది. డిసెంబర్ 13వ తేదీన సోనూసూద్ ట్విట్టర్లో ఓ వీడియో పోస్టు చేశారు. అందులో కదులుతున్న రైల్లో సోనూసూద్ ఫుట్ బోర్డుపై అజాగ్రత్తగా ప్రయాణిస్తూ కనిపించారు. హ్యాండ్రైల్ పట్టుకుని రైలు తలుపు అంచున తన కాలి వేళ్లపై కూర్చొని.. రైలు నుంచి బయటకు చూస్తూ కనిపించారు. దీనిపై అప్పట్లో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కాగా, ఈ ఘటనపై రైల్వే అధికారులు తాజాగా స్పందించారు. రియల్ హీరోని సున్నితంగా హెచ్చరించారు. రైల్లో ఇలా ప్రయాణించడం చాలా ప్రమాదకరమని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ‘డియర్ సోనూ సూద్. మీరు ఎంతో మందికి రోల్ మోడల్. ఇలా రైలు మెట్లపై ప్రయాణించడం చాలా ప్రమాదకరం. ఇలాంటి వీడియోలతో మీ అభిమానులకు తప్పుడు సందేశం పంపినట్లవుతుంది. మరోసారి ఇలాంటివి చేయకండి. రైలు ద్వారా సున్నితమైన, సురక్షితమైన ప్రయాణాన్ని ఆస్వాదించండి’ అంటూ పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
प्रिय, @SonuSood
देश और दुनिया के लाखों लोगों के लिए आप एक आदर्श हैं। ट्रेन के पायदान पर बैठकर यात्रा करना खतरनाक है, इस प्रकार की वीडियो से आपके प्रशंसकों को गलत संदेश जा सकता है।
कृपया ऐसा न करें! सुगम एवं सुरक्षित यात्रा का आनंद उठाएं। https://t.co/lSMGdyJcMO
— Northern Railway (@RailwayNorthern) January 4, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

