Sonia Agarwal: అతని చెంప చెళ్లుమనిపించాను : 7/G బృందావన్ కాలనీ బ్యూటీ

సోనియా అగర్వాల్.. సెల్వరాఘవన్ బ్లాక్ బస్టర్ 7/G బృందావన్ కాలనీ లో హీరోయిన్గా నటించి అందరి మనసులు గెలుచుకుంది. ఆ సినిమాలో క్యూట్ క్యూట్‌గా నటిస్తూ అదరగొట్టిన ఈ భామ తర్వాత కొన్ని తమిళ సినిమాలు చేసి కనుమరుగైంది. తనను తమిళ సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు సెల్వ రాఘవన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సోనియా అగర్వాల్ ఆ తర్వాత ఆయనతో విడాకులు తీసుకుంది.
2006 లో పెళ్లి చేసుకున్న ఈ జోడీ మనస్పర్థలు తలెత్తడంతో 2010లో విడిపోయారు. అయితే అప్పటి నుంచి దాదాపు పదేళ్లు ఒంటరిగానే ఉన్న సోనియా అగర్వాల్.. సోనియా రెండో పెళ్లికి సిద్ధమైందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విడాకుల తర్వాత సోనియా టీవీ షోస్‌తో పాటు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ అలరిస్తుంది. ఆమె నటించిన ద్విభాషా చిత్రం ‘గ్రాండ్మా’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో సోనియా మాట్లాడుతూ.. ఈ చిత్రంలో టీచర్ పాత్ర పోషించాను. సాధారణంగా అనేక చిత్రాల్లో నా పాత్రలన్నీ అమాయకురాలిగా ఉంటాయి. కానీ, ఇందులో నేను రఫ్ అండ్ టఫ్ టైపు. చదువుకునే రోజుల్లో ఓ విద్యార్థి నన్ను హేళన చేసినందుకు లాగి చెంపపై కొట్టాను. నా మాతృభాష పంజాబీ. కానీ, తమిళం, తెలుగు, కన్నడం, మలయాళ భాషల్లో దాదాపు 40కు పైగా చిత్రాల్లో నటించాను అని సోనియా అగర్వాల్ చెప్పుకొచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

