అచ్చమైన తెలుగింటి పిల్ల

సీనియర్ హాస్యనటి శ్రీలక్ష్మి, పార్వతీశం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సావిత్రి w/o సత్యమూర్తి’. గోగుల నరేంద్ర నిర్మాత. చైతన్య కొండ దర్శకుడు. ఈ సినిమాలోని ‘అచ్చమైన తెలుగింటి పిల్లవే’ అనే గీతాన్ని ఇటీవల దర్శకుడు మారుతి విడుదలచేశారు. సత్యకశ్యప్ సంగీతాన్ని అందించారు. ప్రణవం సాహిత్యాన్ని సమకూర్చిన ఈ గీతాన్ని సాయిచరణ్ ఆలపించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇరవైఏళ్ల యువకుడు, అరవైఏళ్ల మహిళ ఎలా భార్యాభర్తలయ్యారనే పాయింట్‌తో రూపొందుతున్న చిత్రమిది. కుటుంబకథా చిత్రంగా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. ఈ నెలాఖరున సినిమాను విడుదలచేస్తాం’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

