Sonakshi Sinha | సోనాక్షి ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై పూనమ్ సిన్హా క్లారిటీ.. నన్ను ఎన్నిసార్లు నానమ్మను చేశారో లెక్కే లేదు..
Sonakshi Sinha | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, ఆమె భర్త జహీర్ ఇక్బాల్ వైవాహిక జీవితంపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా సోనాక్షి గర్భవతి అనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌పై సోనాక్షి తల్లి పూనమ్ సిన్హా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Sonakshi Sinha | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, ఆమె భర్త జహీర్ ఇక్బాల్ వైవాహిక జీవితంపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా సోనాక్షి గర్భవతి అనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌పై సోనాక్షి తల్లి పూనమ్ సిన్హా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఒక ప్రైవేట్ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన పూనమ్ సిన్హా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హాస్యాస్పదంగా స్పందించారు. “సోషల్ మీడియా వల్ల నన్ను ఇప్పటికే ఎన్నిసార్లు నానమ్మను చేసేశారో లెక్కే లేదు!” అంటూ నవ్వుతూ చెప్పారు. అయితే ఆ సంతోషకరమైన రోజు నిజంగా వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సోనాక్షి జననం గురించి గుర్తుచేసుకున్న పూనమ్, మా ఇంట్లోకి ఆడపిల్ల అడుగుపెట్టిన రోజు మా జీవితంలోనే గొప్ప రోజు. ఆడపిల్లలు లేని జీవితం అసంపూర్ణంగా ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ ఒక ఆడపిల్ల ఉండటం ఎంతో ప్రత్యేకం అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో సోనాక్షి ఎరుపు దుస్తుల్లో కనిపించగా, ఆమె చేతిని పొట్టపై ఉంచుకున్న తీరు చూసి నెటిజన్లు గర్భవతి అని ఊహాగానాలు మొదలుపెట్టారు. దీంతో సోషల్ మీడియాలో మరోసారి ప్రెగ్నెన్సీ రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈ తరహా పుకార్లపై గతంలోనే సోనాక్షి సిన్హా తనదైన శైలిలో స్పందించారు. “కేవలం చేతిని పొట్టపై పెట్టుకున్నందుకు నన్ను గర్భవతిని చేసేశారు. మానవ చరిత్రలోనే 16 నెలలు గర్భంతో ఉన్న వ్యక్తిగా నాకు రికార్డు ఇచ్చేశారు” అంటూ సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అటు జహీర్ ఇక్బాల్ కూడా ఒక వేడుకలో సోనాక్షి పొట్టపై చేయి వేసి “జాగ్రత్త” అంటూ సరదాగా స్పందించడం అప్పట్లో వైరల్ అయింది. సోనాక్షి, జహీర్ ప్రేమకథ కూడా ఆసక్తికరమే. 2013లో సల్మాన్ ఖాన్ ఇచ్చిన పార్టీలో తొలిసారి కలుసుకున్న వీరు, దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. చివరకు 2024లో ముంబైలో సన్నిహితుల సమక్షంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

