Sodhara Movie New Poster | హృదయ కాలేయం (Hrudaya Kaleyam) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బర్నింగ్ స్టార్‌గా అందరి హృదయాలను గెలుచుకున్నాడు టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu). చాలా రోజుల తర్వాత ‘మార్టిన్ లూథర్ కింగ్ (Martin Luther King) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో మన ముందుకు వస్తున్నాడు ఈ బర్నింగ్ స్టార్. సంపూర్ణేష్, సంజోష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘సోదరా'(Sodhara). ఇట్స్ ఏ బ్రోమాంటిక్ స్టోరీ అనేది ఉప శీర్షిక. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇదిలావుంటే.. సంక్రాంతి కానుకగా సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను పంచుకుంది చిత్రబృందం. ఈ పోస్టర్లో సంపూర్ణేష్, సంజోష్ ఎండ్ల బండిపై డ్యాన్స్ చేస్తున్నట్లు ఉండగా.. బాబు మోహన్ బండిని నడుపుతున్నట్లు ఉంది. కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాకు మన్ మోహన్ మీనాంపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. CANS ఎంటర్టైన్మెంట్స్ & మాంక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై చంద్ర చాగన్ల నిర్మిస్తున్నాడు.