సాయం గురించి చెప్పను!

సేవాభావం విషయంలో తన ఆలోచనా దృక్పథం వేరని చెప్పింది మిల్కీబ్యూటీ తమన్నా. కరోనా సంక్షోభ సమయంలో సినీ తారలు ఆశించినంత సేవాకార్యక్రమాలు చేపట్టలేదనడం అర్థరహితమని పేర్కొంది. ఇలాంటి విమర్శల వల్ల సినీ సెలబ్రిటీలు ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ ‘సినిమా వాళ్లు దాతృత్వ కార్యక్రమాలు విరివిగా చేయడం లేదనే అపోహను సృష్టించారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదు. చాలా మంది ప్రచారానికి దూరంగా ఉంటూ సేవా కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. అయితే చేసిన సాయం గురించి చెప్పుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. దానినుంచి కొందరైనా స్ఫూర్తిపొంది మరింత సాయం చేయడానికి ముందుకొస్తారు. వ్యక్తిగతంగా మాత్రం నేను ఛారిటీ అంశాల్లో ప్రచారానికి దూరంగా ఉంటాను. చేసిన సహాయం గురించి ఎక్కడా చెప్పను’ అని తెలిపింది. సినీ తారలకు అపారమైన సంపద ఉంటుందని, వారు ఎక్కడకు వెళ్లినా విలాసవంతంగా ఉంటారనే అపోహలు కూడా తొలగిపోవాల్సిన అవసరం ఉందని తమన్నా చెప్పింది. ‘సినిమా వాళ్లకు సులువుగా డబ్బులు రావు. అందరిలాగానే వారూ కష్టపడాలి. తెరపై మాకున్న ఇమేజ్ వల్ల సినీతారలకు ఏదైనా సాధ్యమనే భ్రమలు పెరిగాయి. దాంతో నటీనటులపై ప్రతి విషయంలో ఒత్తిడి ఉంటోంది. ఈ ధోరణిలో మార్పు రావాలి’ అని తమన్నా పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

