Sobhita Dhulipala | మంకీ మ్యాన్.. ట్రైలర్‌తోనే సంచలనం సృష్టిస్తున్న హాలీవుడ్ మూవీ. భారతీయ సూపర్ హీరోను ప్రపంచానికి పరిచయం చేస్తున్న చిత్రమిది. ఇందులో, ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’తో మనకు పరిచయమైన దేవ్ పటేల్ సరసన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ నటిస్తున్నది. రచ్చగెలవడం శోభితకు కొత్తేం కాదు. మలయాళం, తమిళంతో పాటు హిందీ వెబ్ సిరీస్‌తోనూ తన ప్రతిభను లోకానికి చాటింది. అందాల పోటీలతో వచ్చి, మోడలింగ్‌లో స్థిరపడిన శోభిత తొలి సినిమా ‘రామన్ రాఘవ’తోనే భిన్నమైన పాత్రల్ని ఎంచుకునే నాయికగా గుర్తింపు తెచ్చుకున్నది.
కురుప్, మేజర్ లాంటి ఆఫ్‌బీట్ చిత్రాలైనా.. గూఢచారిలాంటి కమర్షియల్ సినిమాలైనా.. మంచి విజయాలే అందుకున్నది. ఇప్పుడు, యాక్షన్ ప్యాక్డ్ మూవీ ‘మంకీ మ్యాన్’లో శోభిత పరిపూర్ణంగా శోభించనున్నట్టు ట్రైలర్ చూస్తేనే తెలుస్తున్నది. ఇందులో కనుక తన నటన విమర్శకుల మెప్పు పొందితే, హాలీవుడ్‌కు మరో భారతీయ నాయిక పరిచయం అయినట్టే.