ఆ పరిమితుల వల్లే వెనకబడ్డా
ప్రత్యేత గీతాల్లో నటించేందుకు పూర్తి వ్యతిరేకంగా ఉండే తాను మనసు మార్చుకుని ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ చేస్తున్నానని చెబుతున్నది హీరోయిన్ స్నేహా ఉల్లాల్. తెలుగులో ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’,
ప్రత్యేత గీతాల్లో నటించేందుకు పూర్తి వ్యతిరేకంగా ఉండే తాను మనసు మార్చుకుని ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ చేస్తున్నానని చెబుతున్నది హీరోయిన్ స్నేహా ఉల్లాల్. తెలుగులో ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘కరెంట్’, ‘యాక్షన్ త్రీడీ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైందీ భామ. వ్యక్తిగత కారణాలతో 2015 తర్వాత సినిమాలేవీ చేయని స్నేహా ఉల్లాల్ గతేడాది దాకా చిత్ర పరిశ్రమకు దూరమైంది. ఆమె నటించిన ‘లవ్ యూ లోక్తంత్ర’ గత అక్టోబర్లో విడుదలైంది. సినిమాల విషయంలో ఎంపికగా ఉండటం, తనకంటూ కొన్ని పరిమితులు పెట్టుకోవడం వల్లే నాయికగా వెనకబడ్డానని ఆమె తెలిపింది. స్నేహా ఉల్లాల్ మాట్లాడుతూ…‘మనం ఏది చేయకూడదు అనుకుంటామో..కొన్నిసార్లు అవే పనులు చేయాల్సి వస్తుంది.
ఐటెం సాంగ్స్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇలాంటి పాటలు చేయమని గతంలో పదుల సంఖ్యలో అవకాశాలు వచ్చాయి. వాటన్నింటినీ తిరస్కరించాను. నటిగా నాకు కొన్ని పరిమితులు పెట్టుకోవడం వల్లే ఈ పాటల్లో ఆడిపాడటాన్ని అంగీకరించలేదు. కానీ ఇలా గిరిగీసుకుంటే పరిశ్రమలో కొనసాగలేమని అర్థమైంది. ప్రత్యేక గీతాల్లో కనిపించేంత పరిణితి ఇప్పుడు నాలో వచ్చిందని భావిస్తున్నా. త్వరలో ఓ తెలుగు చిత్రంలో స్పెషల్ సాంగ్లో కనిపించబోతున్నా. ఎంపికగా ఉండటం వల్ల అనేక చిత్రాల్లో అవకాశాలూ కోల్పోయాను. నేనలా చేసి ఉండకూడదని ఇప్పుడు అనిపిస్తుంటుంది’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- item songs
- Sneha Ullal
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

