అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తన పిల్లలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లు పెడుతూ నెటిజన్స్‌ని అలరిస్తూ ఉంటుంది. తాజాగా తన పిల్లలని దెయ్యాల గెటప్‌లోకి మార్చి ఓ వీడియో చేసింది. ఈ వీడియోకి నా చిన్ని దయ్యాలు అని కామెంట్ పెట్టింది.
దెయ్యాలుగా మారిన అయాన్, అర్హ ఇళ్లంతా తిరుగుతూ నానా హంగామా చేసారట. స్నేహా షేర్ చేసిన వీడియోకి నెటిజన్స్ సూపర్భ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇన్నాళ్లు సోషల్ మీడియాలో సందడి చేసిన అర్హ త్వరలో వెండితెరపై కూడా అలరించబోతుంది. గుణశేఖర్ శాకుంతలం చిత్రంతో అర్హ బాలనటిగా వెండితెరకు పరిచయం కానుంది. ఇటీవలే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాగా, ఈ విషయంపై బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.