ధైర్యంతో నిర్మించుకున్న లెగసీ
అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘స్లమ్ డాగ్'. ‘33 టెంపుల్ రోడ్' ఉపశీర్షిక. పూరీజగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నది.
అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘స్లమ్ డాగ్’. ‘33 టెంపుల్ రోడ్’ ఉపశీర్షిక. పూరీజగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నది. పానిండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానున్నది. ఇదిలావుంటే.. ఈ సోమవారంతో పూరీ తొలి సినిమా ‘బద్రి’ విడుదలై 26ఏండ్లు పూర్తయిన సందర్భంగా పూరీని ప్రశంసిస్తూ హీరో విజయ్ సేతుపతి తన వ్యక్తిగత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘పూరీ ప్రయాణం ఓ అద్భుతం.
దర్శకుడిగా 26ఏండ్లు అంటే, అది కేవలం మైలురాయి కాదు. ధైర్యం, నమ్మకంతో నిర్మించుకున్న ఒక లెగసీ. డియర్ పూరీసార్.. ‘స్లమ్గాడ్’ చిత్రం కోసం మీతో కలిసి పనిచేయడం నాకెంతో ఆనందం. మమ్మల్ని నమ్మి, మా కంఫర్ట్ జోన్ దాటి మమ్మల్ని తీసుకెళ్లే దర్శకులను మేం కోరుకుంటాం. మీరింకా ఎన్నో విజయాలు సాధించాలి. మరెన్నో ప్రభావవంతమైన కథలు చెప్పాలి’ అని విజయ్ సేతుపతి పోస్ట్లో పేర్కొన్నారు. సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, దునియా విజయ్ కీలక పాత్రధారులు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

