శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రిన్స్’. అనుదీప్ కెవీ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. సునీల్ నారంగ్, సురేష్‌బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలు. ఈ సినిమా తొలి గీతాన్ని సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘సకుటుంబ కథా చిత్రమిది. వినోదానికి పెద్దపీట వేస్తున్నాం. పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో కథ నడుస్తుంది. ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్గా అందరిని మెప్పిస్తుంది’ అని చెప్పారు. మరియా ర్యాబోషప్క, సత్యరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, సహనిర్మాత: అరుణ్‌విశ్వ, రచన-దర్శకత్వం: అనుదీప్ కేవీ.