శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ప్రిన్స్’. మరియా ర్యాబోషప్క నాయికగా నటిస్తున్నది. సత్య రాజ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. దర్శకుడు అనుదీప్ కేవీ తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ పతాకాలపై సునీల్ నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మంగళవారం చిత్ర రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. దీపావళి పండక్కి సినిమాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఒక వీడియోను రిలీజ్ చేశారు. హీరో, హీరోయిన్లతో పాటు సత్యరాజ్, దర్శకుడు అనుదీప్ ఈ సినిమా విడుదల తేదీ విశేషాలను ఈ వీడియోలో పంచుకున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్, సమర్పణ : సోనాలి నారంగ్, రచన, దర్శకత్వం : అనుదీప్ కేవీ.