Sivaji Ganesan: శివాజీ గణేషన్‌కి నివాళులు అర్పించిన గూగుల్ డూడుల్..!

విలక్షణ నటనకు నిలువెత్తు నిదర్శనం శివాజీ గణేషన్. కమల్ హాసన్, శివకుమార్, జైశంకర్, విక్రమ్, సూర్య వంటి స్టార్ హీరోలకు ఆదర్శంగా నిలిచిన శివాజీ గణేషన్ తన స్టార్‌డమ్‌ను ఖండాంతరాలు దాటించారు.1928 అక్టోబర్ 1న ఆయన తమిళనాడులోని విల్లుపురంలో జన్మించిన ఆయన అసలు పేరు వి. చిన్నయ్య మన్రయార్ గణేశమూర్తి. తమ కన్నవారికి నాల్గవ సంతానంగా శివాజీగణేశన్ జన్మించారు.
ఏడేళ్ల ప్రాయంలోనే టూరింగ్ స్టేజ్ డ్రామా కంపెనీ వెంట తల్లిదండ్రులకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు. స్టేజీపై ఆయన నటనను చూసి మైమరిచిపోయిన ప్రముఖ సంఘసంస్కర్త ఈవీ రామస్వామి.. గణేసన్ను నటనలో ‘శివాజీ’గా అభివర్ణించాడు. అలా ఆయన పేరు అప్పటి నుంచి శివాజీ గణేషన్ అయ్యింది.
1952లో ప్రజాశక్తి సినిమా ద్వారా ఆయన తెరంగగ్రేటం చేశారు. అప్పటి నుంచి 300 సినిమాల్లో నటించారు. శివాజీ గణేశన్ మదరాసులో నాటకాలు వేస్తూ, తమిళ చిత్రాలలో నటించిన ప్రముఖ తెలుగునటులకు డబ్బింగ్ చెబుతూ ఉండేవారు. మన తెలుగు నటులు ముక్కామలకు శివాజీ కొన్ని సినిమాల్లో డబ్బింగ్ చెప్పారు.
యన్టీఆర్ శ్రీరామునిగా నటించిన తొలి చిత్రం ‘సంపూర్ణ రామాయణం’ తమిళ చిత్రంలో శివాజీ గణేశన్ భరతునిగా నటించారు. తరువాత యన్టీఆర్ రామునిగా, శివాజీ గణేశన్ లక్ష్మణునిగా నాగయ్య నిర్మించి, నటించిన ‘భక్తరామదాసు’లో కనిపించారు. తమిళంలో శివాజీ గణేశన్ నటించిన చిత్రాలు తెలుగులో యన్టీఆర్ హీరోగా కొన్ని సినిమాలు, ఏయన్నార్ కథానాయకునిగా కొన్ని మూవీస్ తెరకెక్కి అలరించాయి.
శివాజీ గణేశన్ కెరీర్ లో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా ‘వసంతమాళిగై’ నిలచింది. ఇది తెలుగులో ‘ప్రేమనగర్’ ఆధారంగా తెరకెక్కిన తమిళ చిత్రం. పద్మశ్రీ, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి జాతీయ అవార్డులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదానం చేసే యన్టీఆర్ జాతీయ అవార్డునూ ఆయన అందుకున్నారు.
ఆయన వారసుడు ప్రభు కూడా అనేక చిత్రాలలో హీరోగా నటించి అలరించారు. అయితే కమల్ హాసన్ ను తన నటవారసునిగా శివాజీ ప్రకటించడం విశేషం! 2001 జూలై 21న శివాజీ గణేశన్ కన్నుమూశారు. ఆయన 93వ జయంతి సందర్భంగా గూగుల్ ఇవాళ డూడుల్‌తో ఆయన్ని గుర్తు చేసింది. బెంగళూరుకు చెందిన నూపూర్ రాజేష్ చోక్సీ.. ఈ డూడుల్‌ను క్రియేట్ చేశాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

