Prince Movie | విశ్వక్ సేన్‌తో పోటీకి వస్తున్న శివ కార్తికేయన్.. ఆసక్తికరంగా ‘ప్రిన్స్’ లేటెస్ట్ పోస్టర్..!
Prince Movie Release Date Announced | తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు శివ కార్తికేయన్. 'డాక్టర్', 'డాన్' వంటి వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్లతో తెలుగులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ రెండు చిత్రాలు తెలుగులో కమర్షియల్‌గా ఘన విజయాలు సాధించాయి.
Prince Movie Release Date Announced | తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు శివ కార్తికేయన్. ‘డాక్టర్’, ‘డాన్’ వంటి వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్లతో తెలుగులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ రెండు చిత్రాలు తెలుగులో కమర్షియల్‌గా ఘన విజయాలు సాధించాయి. ప్రస్తుతం ఈయన నేరుగా తెలుగులో ‘ప్రిన్స్’ సినిమా చేస్తున్నాడు. ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. కాగా ఈ చిత్రాన్ని ముందుగా ఆగస్టు చివరి వారంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ పలు కారణాల వల్ల సినిమా వాయిదా పడింది.
అప్పుడే సినిమా రిలీజ్‌ను దీపావళికి మార్చుతున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా మేకర్స్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ దీపావళికి వస్తున్నట్లు కన్ఫార్మ్ చేశారు. ఈ పోస్టర్లో శివ కార్తికేయన్ చిన్న పిల్లలతో కలిసి అల్లరి చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీను శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. శివ కార్తికేయన్‌కు జోడీగా మరియా ర్యాబోషప్క హీరోయిన్గా నటిస్తుంది. సత్యదేవ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్.ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన రెండు పాటలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.
#Prince @Siva_Kartikeyan is Coming to Theatres to Light up your Diwali! 🪔 @anudeepfilm @maria_ryab @manojdft @Cinemainmygenes #Sathyaraj @Premgiamaren @SVCLLP @SureshProdns @ShanthiTalkies @Gopuram_Cinemas @adityamusic @AdityaTamil_ #Prince🕊️ #PrinceFromDiwali2022 pic.twitter.com/r56ds4Oxf0
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) October 1, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SS Rajamouli | ‘వారణాసి’ కథలో అదే కీలకం!
Venkatesh | 30న వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’
Delhi Airport | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పంజాబ్ సీఎం నిలిపివేత.. ఇది కేంద్రం వేధింపులేనని ఆప్ ఆరోపణ
Credit Cards | క్రెడిట్ కార్డు చెల్లింపులు ఆలస్యమైనా చార్జీల్లేవ్.. యూజర్లకు ఆర్బీఐ ఊరట
Parakala Prabhakar | ‘సర్’ వ్యతిరేక నిరసనలో పరకాల ప్రభాకర్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

