Prince Movie First Single | తమిళ హీరో శివ కార్తికేయన్ ప్రస్తుతం తెలుగులో మార్కెట్‌ను పెంచుకునే పనిలో ఉన్నాడు. ‘రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శివ కార్తికేయన్ ‘డాక్టర్’, ‘డాన్’ వంటి వరుస హిట్లతో టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలో శివ నేరుగా తెలుగులో ‘ప్రిన్స్’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ఇక్కడి ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ కేవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు.
తాజాగా చిత్రబృందం ఈ సినిమాలోని ‘బింబిలిక్కి పిలాపి’ అంటూ సాగే మెలోడీయస్ పెప్పి సాంగ్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించిన ఈ పాటను రామ్ మిర్యాల ఆలపించాడు. తమన్ స్వర పరిచిన ఈ పాట క్యాచీగా ఉంది. శివ కార్తికేయన్ సిగ్నేచర్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో శివ కార్తికేయన్‌కు జోడీగా మారియా ర్యాబోషప్క హీరోయిన్గా నటించింది. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. మొదటి ఈ చిత్రాన్ని ఆగస్టు 31న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను రెండు నెలలు పోస్ట్ పోన్ చేశారు.