Prince Movie | ‘ప్రిన్స్’ రన్ టైం మరీ అంత తక్కువా?
Prince Movie Run Time | 'రెమో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శివ కార్తికేయన్.. 'డాక్టర్', 'డాన్' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ప్రిన్స్ విడుదలకు సిద్ధంగా ఉంది.
Prince Movie Run Time | ‘రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శివ కార్తికేయన్.. ‘డాక్టర్’, ‘డాన్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ప్రిన్స్ విడుదలకు సిద్ధంగా ఉంది. జాతిరత్నాలు ఫేం అనుదీప్ కేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై విపరీతమైన అంచానాలు క్రియేట్ చేశాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస ప్రమోషన్లతో బిజీ బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది.
ఈ చిత్రానికి సెన్సార్ యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఇక ఈ సినిమా రన్ టైం 2గంటల 11 నిమిషాలు ఉండనుంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. శివ కార్తికేయన్‌కు జోడీగా మరియా ర్యాబోషప్క హీరోయిన్గా నటించింది. సత్యరాజ్ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ముందుగా ఈ చిత్రాన్ని మేకర్స్ ఆగస్టు చివరి వారంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ పలు కారణాల వల్ల దీపావళికి పోస్ట్‌పోన్ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

